Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Postal Ballot Rules 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) మరో కీలక సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలో జరగనున్న ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అమర్చే విధానంలో మార్పులు చేసింది. సాధారణ బ్యాలెట్ పేపర్ల తరహాలోనే పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కూడా అభ్యర్థుల పేర్లను నాలుగు కేటగిరీల క్రమంలో ముద్రించాలని ఆదేశించింది.
నాలుగు కేటగిరీల్లో అభ్యర్థుల పేర్లు
గతంలో అమల్లో ఉన్న నిబంధనలను సవరిస్తూ, పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లను కింది నాలుగు కేటగిరీల క్రమంలో అమర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
Also Read
- AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
- Arnab Cyclone Alert: తుఫాన్‌పై హైఅలర్ట్.. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వద్దు..!
- Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు
- Arnab Cyclone Alert: తుఫాన్ విరుచుకుపడుతుంది.. విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వండి.. సీఎం ఆదేశాలు..
- గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు.
- రిజర్వ్డ్ గుర్తు కలిగిన రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అభ్యర్థులు.
- రిజర్వ్డ్ గుర్తు లేని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అభ్యర్థులు.
- స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థులు.
ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లను ముద్రించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు, పార్టీల పేర్లు తెలుగులోనే ముద్రణ
పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై మొదటి మూడు కేటగిరీలకు చెందిన అభ్యర్థుల పేర్లతో పాటు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీల పేర్లను కూడా తెలుగులోనే ముద్రించాలని APSEC ఆదేశించింది. ఓటర్లకు అభ్యర్థులు, వారి రాజకీయ పార్టీల వివరాలు స్పష్టంగా అర్థమయ్యేలా ఈ నిబంధనను అమలు చేయనున్నారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై ఎలాంటి ఎన్నికల గుర్తులను (Symbols) ముద్రించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అభ్యర్థుల పేర్లు, రాజకీయ పార్టీల వివరాలను నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ముద్రించాల్సి ఉంటుంది.
స్వతంత్ర అభ్యర్థుల విషయంలో ప్రత్యేక నిబంధన
ఏ రాజకీయ పార్టీకి చెందని స్వతంత్ర అభ్యర్థుల పేర్ల కింద తెలుగులో “స్వతంత్ర అభ్యర్థి” అని స్పష్టంగా ముద్రించాలని సర్క్యులర్‌లో పేర్కొంది. తద్వారా స్వతంత్రంగా పోటీ చేసే అభ్యర్థులను ఓటర్లు సులభంగా గుర్తించేలా నిబంధనను రూపొందించారు.
నోటాకు ప్రత్యేక స్థానం
పోస్టల్ బ్యాలెట్ పేపర్లో చివరి అభ్యర్థి పేరు తర్వాత వచ్చే ప్యానెల్లో నోటా (NOTA) కోసం స్థానం కేటాయించాలని APSEC ఆదేశించింది. అక్కడ తెలుగులో “పైన ఎవరూ కాదు (నోటా)” అని ముద్రించాలి.
2026 MPTC, ZPTC ఎన్నికలకు మార్గదర్శకాలు
2026లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, అభ్యర్థుల పేర్ల క్రమం, పార్టీల పేర్ల ముద్రణ, స్వతంత్ర అభ్యర్థుల వివరాలు, నోటా స్థానానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. సంబంధిత అధికారులు పోస్టల్ బ్యాలెట్ పేపర్లను రూపొందించే సమయంలో సవరించిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!