AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Weather Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టాయి.. కొన్ని జిల్లాల్లో బీభత్సాన్నే సృష్టించాయి.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కలిగించాయి.. మరోవైపు రాష్ట్రంలో రాగల మూడు గంటల్లో తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు.
ఇక, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Also Read
- AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
- Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
- Arnab Cyclone: మరోసారి చంద్రబాబు సమీక్ష.. ప్రస్తుత పరిస్థితి ఇది..! విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కీలక ఆదేశాలు
- Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
కాగా, అర్నబ్ తుఫాన్ పై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇప్పటి వరకు కలిగిన పంట నష్టంతో పాటు.. ఇతర నష్టాలను కూడా అంచనా వేయాలని సూచించిన ఆయన.. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.. మరోవైపు.. వర్షాలు ఆగే వరకు.. సహాయక చర్యలు పూర్తి అయ్యే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అధికారులను ఆదేశించారు..
తాజావార్తలు
-
AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
-
Avengers Doomsday: ఒక రోజు ముందే ఇండియాలో ‘ఎవెంజర్స్ డూమ్స్‌డే’ రిలీజ్! రీజన్ ఇదేనా..
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!