School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
School Holidays: వచ్చే 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు మొత్తం 87 రోజుల సెలవులు ఉండనున్నాయి. అదనంగా ఐదు ఐచ్ఛిక సెలవులు, స్థానిక పండుగలు మరియు జాతరల కోసం మూడు స్థానిక సెలవులు కూడా ఇవ్వనున్నారు. విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు పాఠశాలలు పని చేయనున్నాయి. ఈ క్యాలెండర్ రూపకల్పనకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాలను విద్యాశాఖ స్వీకరించింది. ఉపాధ్యాయుల పని భారం సమతుల్యం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించింది.
Read Also: Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
ప్రతి ఉపాధ్యాయుడు వారానికి కనీసం 24 బోధనా పీరియడ్లు నిర్వహించాలి, గరిష్ఠంగా 30 పీరియడ్లు మించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది. అవసరమైతే భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు గణితం కూడా బోధించేలా మార్పులు చేపట్టనున్నారు. ఇక, జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విద్యార్థుల ప్రవేశాలకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. అలాగే ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’గా నిర్వహించి, విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
విద్యార్థులను కొత్త తరగతులకు సిద్ధం చేయడానికి తరగతి సంసిద్ధత కార్యక్రమాలను అమలు చేస్తారు. 1, 2, 6 తరగతులకు జూన్ 12 నుంచి ఆగస్టు 3 వరకు 36 రోజులపాటు, 3, 4, 5, 7, 8 తరగతులకు జూన్ 12 నుంచి 30 వరకు 13 రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సెలవుల విషయానికి వస్తే, సాధారణ పాఠశాలలకు అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి. మైనారిటీ పాఠశాలలకు అక్టోబర్ 15 నుంచి సెలవులు ప్రారంభమవుతాయి. క్రిస్మస్ సందర్భంగా మైనారిటీ విద్యాసంస్థలకు డిసెంబర్ 20 నుంచి 27 వరకు సెలవులు ఉండగా, సాధారణ పాఠశాలలకు డిసెంబర్ 25న ఒకరోజు మాత్రమే సెలవు ఉంటుంది. సంక్రాంతి సెలవులు 2027 జనవరి 11 నుంచి 17 వరకు ఉంటాయి.
ఇక, పరీక్షల షెడ్యూల్ విషయానికి వస్తే.. ఫార్మేటివ్-1 పరీక్షలు ఆగస్టు 3 నుంచి 6 వరకు, ఫార్మేటివ్-2 అక్టోబర్ 5 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. సమ్మెటివ్ పరీక్షలు నవంబర్ 9 నుంచి 20 వరకు జరగనున్నాయి. ఫార్మేటివ్-3 జనవరి 4 నుంచి 7 వరకు, ఫార్మేటివ్-4 ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు నిర్వహిస్తారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు, గ్రాండ్ టెస్ట్ మరియు తొమ్మిదో తరగతి సమ్మెటివ్-2 పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి. 1 నుంచి 8 తరగతుల సమ్మెటివ్-2 పరీక్షలు 2027 ఏప్రిల్ 3 నుంచి 17 వరకు నిర్వహిస్తారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 15 నుంచి 31 వరకు జరుగనున్నాయి. ఈ అకడమిక్ క్యాలెండర్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు స్పష్టమైన ప్రణాళిక లభించడంతో పాటు, విద్యా వ్యవస్థ మరింత క్రమబద్ధంగా సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..