AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రతిపాదనలు..!

Pawan Babu

Pawan Babu

AP Municipal Elections: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సమావేశంలో మంగళవారం జరిగిన సమావేశంలో కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఎక్కడెక్కడ పోటీ చెయ్యాలి.. ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలి అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఒక జాబితాను సీఎం చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ ఇచ్చినట్టు తెలిసింది.. ఈ జాబితాపై టీడీపీ కసరత్తు చేస్తోంది.. ఐదు మేయర్ స్థానాలను జనసేన అడిగినట్టుగా తెలుస్తోంది…

రేపు విజయవాడలో కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమన్వయ కమిటీలో కూడా జనసేన, బీజేపీ ప్రతినిధుల నుంచి జాబితాను తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా బలమున్న స్థానాల వివరాలు ఇవ్వాలని జనసేన, బీజేపీ ప్రతినిధులను కోరింది టీడీపీ.. కామన్ గా. మూడు పార్టీలు అడుగుతున్న స్థానాల వివరాలు. ప్రధానంగా జనసేన. బీజేపీ అడుగుతున్న స్థానాలపై డిటైల్డ్ రిపోర్ట్.. తయారు చేయనుంది. కూటమి సమన్వయ కమిటీ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్ మధ్య మరోసారి జరిగే చర్చల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్ర సమన్వయ కమిటీలో కూడా జనసేన, బీజేపీ ప్రతినిధుల నుంచి జాబితాను తీసుకోవాలని ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడును ఆదేశించారు సీఎం చంద్రబాబు.. జూమ్ కాన్ఫరెన్స్ లో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.. రిజర్వేషన్లు ఖరారు అయ్యాక జాబితాలపై ఒక నిర్ణయానికి వద్దామని సూచించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ముందుగా బలమున్న స్థానాలు ఏవీ అనుకుంటున్నారు.. వాటి వివరాలు ఇవ్వాలని కోరారు టీడీపీ ప్రతినిధులు. రేపు విజయవాడలో రాష్ట్ర సమన్వయ కమిటీ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఈ భేటీలో పూర్తిస్థాయిలో జాబితాలు ఇవ్వాలని జనసేన, బీజేపీ ప్రతినిధులను కోరింది. టీడీపీ… ఈ జాబితాలు ఇచ్చిన తర్వాత. పోటి చేసే స్థానాలకు సంబంధించి స్పష్టత రానుంది.