AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC, ZPTC Elections Rescheduled: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇక, అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్, అవసరమైన చోట రీపోలింగ్, ఓట్ల లెక్కింపును నిర్ణీత తేదీల్లో నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. ఎన్నికలకు సంబంధించిన తదుపరి ఏర్పాట్లను అధికారులు చేపట్టనున్నారు.
అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం 20.10.2026 నాటి నోటిఫికేషన్ ద్వారా గతంలోనే తీసుకున్న నిర్ణయం ప్రకారం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాలకు చెందిన 44 పోలింగ్ కేంద్రాలు, పోలవరం జిల్లాలోని 7 మండలాలకు చెందిన 44 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ముగింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకు మార్చడం జరిగింది. కాబట్టి, ఈ మొత్తం 88 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ మరియు రీ-పోలింగ్ (ఏదైనా ఉంటే) మధ్యాహ్నం 3:00 గంటలకే ముగుస్తాయి. సవరించిన ఈ షెడ్యూల్ గురించి కలెక్టర్లు మరియు జిల్లా ఎన్నికల అధికారులు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా..
Also Read
- Arnab Cyclone: అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.. తుఫాన్ తగ్గే వరకు క్షేత్రస్థాయిలోనే ఉండాలి..
- Arnab Cyclone: మరోసారి చంద్రబాబు సమీక్ష.. ప్రస్తుత పరిస్థితి ఇది..! విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కీలక ఆదేశాలు
- Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
- Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
-
Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!