Site icon NTV Telugu

AP High Court: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. అతడిని వెంటనే విడుదల చేయండి..

Turaka Kishore

Turaka Kishore

AP High Court: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత తురకా కిషోర్ అరెస్ట్‌ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ ను అరెస్టు చేశారని పేర్కొంది.. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది.. అసలు, అరెస్టు చేసిన సమయంలో పాటించాల్సిన నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, రిమాండ్‌ విధింపులో చట్ట ఉల్లంఘనలు ఉన్నాయని తెలిపింది ఏపీ హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించినప్పుడు అరెస్టు అయిన వ్యక్తిని ఒక్క క్షణం కూడా జైల్లో ఉంచడానికి వీళ్లేదని స్పష్టం చేసింది.. తన అరెస్టు, రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ తురకా కిషోర్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది..

Read Also: Viveka Murder Case: ఎస్పీని కలిసిన వైఎస్‌ సునీత.. వైఎస్‌ వివేకా కేసులో హాట్‌ కామెంట్స్..

Exit mobile version