వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్ ఎట్డకేలకు జైలు నుండి విడుదలయ్యారు. ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న కిషోర్.. ఏపీ హైకోర్టు ఆదేశాలతో విడుదలయ్యాడు. ఇప్పటికే కిషోర్ పై 11 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. ఆరేళ్ల క్రితం జరిగిన దాడి కేసులో రెంటచింతల పోలీసులు కిషోర్ ను పీటీ వారెంట్ పై అరెస్టు చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తురకా కిషోర్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. నిబంధనలకు విరుద్ధంగా కిషోర్ ను అరెస్టు చేశారని పేర్కొంది.. తురకా కిషోర్ రిమాండ్ రిపోర్టును రిజెక్ట్ చేసింది.