Kakani Govardhan Reddy: కాకాణి పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం..!

  • కాకాణి గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
  • కాకాణి కేసులో చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం..
  • ఈ కేసులో కాకాణి ఏ 4గా ఉన్నారు..
Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు చేపట్టకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.. ఈ కేసులో కాకాణి ఏ 4గా ఉన్నారు.. పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా.. కాకాణి సహకరించటం లేదని ప్రభుత్వం.. హైకోర్టుకి తెలియజేసింది.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేసినట్టు కోర్టులో మెమో ఫైల్ చేసింది.. అయితే, హైదరాబాద్ లో ఉన్న కారణంగా పోలీసు విచారణకు హాజరు కాలేకపోయారని కాకాణి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది..

Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు” పాస్ అవుతుందా.. బీజేపీ, ఇండీ కూటమి బలాబలాలు ఎంత..?

అయితే, పోలీసులు రెండో నోటీసులు జారీ చేసిన.. వరుసగా రెండో రోజూ కూడా పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ముందస్తు బెయిల్‌ కోసం.. మరోవైపు.. కేసు క్వాష్‌ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కాకాణిపై తొందరు పాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది ఏపీ హైకోర్టు.. పొదులుకూరు పోలిసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా.. విచారణ జరిపి తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం.. వివరాలు సమర్పించాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..