AP High Court: టానిక్ లిక్కర్ ఎలైట్ స్టోర్ బ్రాండ్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. TONIQUE తమ ఒరిజినల్ బ్రాండ్ గా ఉంటే కాపీ చేసి The TONIC పేరుతో ట్రేడ్ మార్క్ కాపీ చేసి విక్రయాలు చేస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలైది.. మూడు రాష్ట్రాల్లో టానిక్ బ్రాండ్ తో అమ్మకాలు చేస్తోంది సంస్థ.. అయితే, నెల్లూరులో టానిక్ బ్రాండ్ కు ది టానిక్ పేరుగా కాపీ చేసి లిక్కర్ అమ్మకాలు చేయటంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. టానిక్ ట్రేడ్ మార్క్ బ్రాండ్ ఎవరూ వాడవద్దని ఆదేశాలు జారీ చేసింది.. నెల్లూరులో టానిక్ బ్రాండ్ ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది..
Read Also: SalmanKhan : అరుదైన వ్యాధితో బాధపడుతున్న సల్మాన్ ఖాన్