Andhra Pradesh: వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు.. కొత్త కార్పొరేషన్ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం.. ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ డిస్కమ్‌ల నుంచి APRAPL పరిధిలోకి వ్యవసాయ ఫీడర్ ఆస్తుల బదిలీ జరగనుంది. అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్‌కు పంపిణీ లైసెన్స్ మంజూరుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోలార్ విద్యుత్ సరఫరా కోసం APRAPL మరియు డిస్కమ్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.. దశలవారీగా 11KV ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ బాధ్యతలు తీసుకోనుంది.. APRAPL.. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి ఆస్తుల బదిలీ ప్రక్రియ జరగనుంది.. వీటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్..
Read Also: Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన నిందితుడు.!
Also Read
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ విద్యుత్ సరఫరా వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. రైతులకు సౌర విద్యుత్ సరఫరాను మరింత సమర్థవంతంగా అందించేందుకు కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కార్పొరేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించడం, సౌర విద్యుత్ వినియోగాన్ని విస్తరించడం లక్ష్యంగా నిర్ణయించింది. కొత్త కార్పొరేషన్‌కు డిస్కంల ఆస్తులను బదలాయించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీ ప్రక్రియను దశలవారీగా అమలు చేయాలని స్పష్టం చేసింది. సంబంధిత మౌలిక సదుపాయాలు, పరికరాలు, ఇతర ఆస్తులను క్రమంగా కొత్త సంస్థ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఈ ఆస్తుల బదిలీ అమలు అధికారాన్ని ప్రభుత్వం అప్పగించింది. బదిలీ ప్రక్రియ వేగవంతంగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా, కొత్త కార్పొరేషన్ విద్యుత్ పంపిణీ లైసెన్స్ కోసం Andhra Pradesh Electricity Regulatory Commissionకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగం పెరగడం ద్వారా రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!