AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి రోజు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకను డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.. ఉద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి సర్కార.. ఇక, గత ఏడాది అంటే 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది. అంటే, డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్.. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.. కొత్త డీఏతో పాటు సంబంధిత బకాయిలు కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది ఏపీ ఆర్థికశాఖ..
Read Also: PM Modi: గోవాలో నౌకాదళంతో కలిసి మోడీ దీపావళి వేడుకలు
కాగా, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించింది. నాలుగు పెండింగ్ డీఏలకు గాను ఒక డీఏను ఇవ్వడానికి ఒప్పుకుంది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.. దీని కోసం ప్రతి నెలా రూ.160 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే. అలాగే, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ ను 180 రోజులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా ఈ చైల్డ్ కేర్ లీవ్ తీసుకునే అవకాశం కల్పించారు. అయితే, మొత్తం ఉద్యోగులకు కలిసి రాష్ట్ర రెవెన్యూలో 99.50 శాతం జీతభత్యాలకు పోతోంది అన్నారు. రూ. 51,200 కోట్లు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది.. దాపరికం ఏమీ లేదు, ఎవరినీ పట్టించుకోని పరిస్థితి లేదు.. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఈ ఏడాది రూ. 51, 400 కోట్లు రాష్ట్ర ఆదాయం అయితే రూ. 51, 200 కోట్లు జీతాల రూపేణా ఇచ్చామన్నారు. మన రాష్ట్రంలో 99 శాతం రెవెన్యూ HR కే వెళ్తుందన్నారు. రాష్ట్రాల రెవెన్యూలో కేరళ 68 శాతం, తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 38 శాతం జీతభత్యాలకు ఇస్తోంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించిన విషయం విదితమే.. కాగా, ఇప్పుడు 2024 జనవరి 1వ తేదీ నుంచి డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.. డీఏ పెంపు 2024 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్..
