AP Government: పండుగ సమయంలో ఒక్కసారిగా పెరిగిపోయాయి వంట నూనెల ధరలు.. ఇదే సమయంలో కూరగాయల ధరలు కూడా పైపైకి చేరుతున్నాయి.. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది.. ఇవాళ్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. కిలో పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. రాష్ట్రంలో వంటనూనెల అమ్మకంలో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అమ్మకం జరపాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు వంట నూనె సప్లయర్లు, డిస్ట్రిబ్యూటర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.. దీనికి సుముఖత వ్యక్తం చేశారు డీలర్లు, సప్లయర్లు.
Read Also: Donald Trump: భారత్ అత్యధికంగా ట్యాక్స్ విధిస్తోంది.. చైనా, బ్రెజిల్‌లో కూడా..!
కాగా, పండుగల వేళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిన విషయం విదితమే.. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకు పెంచేయడంతో.. సన్‌ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్‌పై ఇంపోర్ట్ టాక్స్ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి చేరింది. అయితే, దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకొనేందకు ఈ నిర్ణ యం తీసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. కానీ, ఇంపోర్ట్ టాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.. అన్ని రకాల వంట నూనెల ధరలు లీటర్‌పై ఒకసారిగా రూ.15-20 వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో.. తగ్గింపు ధరలకు వంట నూనెలు అందించేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం..
Read Also: Donald Trump: భారత్ అత్యధికంగా ట్యాక్స్ విధిస్తోంది.. చైనా, బ్రెజిల్‌లో కూడా..!
ఈ నేపథ్యంలో.. వంట నూనెల ధరలకు పౌరసరఫరాల శాఖ కళ్లెం వేసేందుకు చర్యలకు దిగింది.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకమైన ధరల్ని అమలు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.. వంటనూనె అమ్మకాల్లో వ్యత్యాసం లేకుండా ఒకే ధరకు అందించాలని స్పష్టం చేసింది.. వంట నూనెల సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ మరియు వర్తకులతో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. ప్రతి రేషన్ కార్డుపై రిఫైండ్ ఆయిల్‌ను గరిష్టంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి రేషన్ కార్డుపై నెలకు సరిపడా వంట నూనెను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు..