Amaravati Farmers: ఆ రైతులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లో కౌలు నిధులు జమ..
- అమరావతి రైతులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- రైతుల ఖాతాల్లో వార్షిక కౌలు జమ..
- రాజధాని రైతుల వార్షిక కౌలు నిమిత్తం రూ.6.64 కోట్లు విడుదల..
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారి ఖాతాల్లో వార్షిక కౌలు జమ చేసింది ప్రభుత్వం.. రాజధాని రైతుల వార్షిక కౌలు నిమిత్తం రూ.6.64 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం.. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, భూ యజమానులకు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన వార్షిక కౌలు ఈ రోజు జమ చేసింది.. అయితే, రైతుల బ్యాంక్ ఖాతాల లింకేజీ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక కారణాల వలన కొందరు రైతులకు సొమ్ము జమ కాలేదు.. కొంతమంది రైతులు తమ ప్లాట్లను విక్రయించినందున, అదే విధంగా మరణించిన రైతుల యొక్క వారసుల ఖాతాల సర్టిఫికెట్ ఇవ్వడంలో ఆలస్యం జరిగింది.. కౌలు లబ్ధి జమ చేయడానికి నిర్ణీత ధ్రువపత్రాలు అధికారులకు అందిన తర్వాత కౌలు జమ చేయనున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.. మరోవైపు, పలువురు రైతుల ఖాతాలలో 9వ, 10వ, 11వ ఏడాదికి సంబంధించి సొమ్ము కూడా జమ కానుట్టగా గుర్తించారు.. ఈ తరహా సమస్యలను పరిష్కరించిన సీఆర్డీఏ.. 495 మందికి అందాల్సిన పెండింగ్ వార్షిక కౌలు నిధులు విడుదల చేసింది..
Read Also: VD15: కాంబినేషన్ అదిరింది.. విజయ్ దేవరకొండ కొత్త మూవీ స్టార్ట్!
తాజావార్తలు
-
Kiren Rijiju: బిల్లు వీగిపోవడంపై సంబరాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై కిరణ్ రిజిజు ధ్వజం
-
Ram Pothineni New Movie: డైరెక్టర్ వేటలో రామ్ పోతినేని.. ఎప్పటికి దొరికేనో!
-
Regina: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
NTR Birthday: ఒకటి రెండు కాదు, ఏకంగా నాలుగు.. ఈసారి ఎన్టీఆర్ బర్త్ డే అదిరిపోద్ది!
-
PM Modi: విపక్షం తప్పు చేసింది.. పర్యవసానాలు చూస్తారు.. కేబినెట్‌లో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!