AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Employee Transfers Ban: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు బదిలీలతో పాటు కొత్త నియామకాలు, పదోన్నతులు (ప్రమోషన్లు), డిప్యుటేషన్లపై కూడా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణ, కేడర్ సంఖ్య ఖరారు, ఉద్యోగుల పంపిణీ, అమలు మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ‘రాష్ట్రపతి ఉత్తర్వు–2025’ ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాలకు స్థానిక కేడర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
అయితే, మార్కాపురం, పోలవరం జిల్లాలు ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వు–2025 పరిధిలోకి రావని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తామని స్పష్టం చేసింది.
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
ఆంధ్రప్రదేశ్‌ను 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజన
కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
మల్టీ జోన్ – 1
జోన్–1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు
జోన్–2: తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి
జోన్–3: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు
ఈ జోన్లో అమరావతి రాజధాని ప్రాంతం కూడా ఉంటుంది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల మధ్య పోస్టుల పంపిణీకి ప్రత్యేక నిష్పత్తి అమలు చేయనున్నారు.
మల్టీ జోన్ – 2
జోన్–4: బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జోన్–5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్–6: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి
కర్నూలు, నంద్యాల జిల్లాల మధ్య పోస్టులను 55:45 నిష్పత్తిలో పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక, ఈ మార్గదర్శకాలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు పోస్టులకు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!