NTV Telugu Site icon

Special Officers for Districts: జిల్లాలకు స్పెషల్‌ ఆఫీసర్లుగా ఐఏఎస్‌లు.. ఏ జిల్లాకు ఎవరంటే..?

Ap

Ap

Special Officers for Districts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. భారీ స్థాయిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. మరోవైపు ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. జిల్లాలకు స్పెషల్‌ ఆఫీసర్లుగా ఐఏఎస్‌ అధికారులను నియమించింది.. ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లాకో స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు 26 మంది ఐఏఎస్‌ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం..

Read Also: Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ పెట్టేది..

ఇక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివిధ జిల్లాలకు నియమించిన స్పెషల్‌ ఆఫీసర్లు..:
1. ఎన్టీఆర్ జిల్లా – జయలక్ష్మీ.
2. ఏలూరు – శశిభూషణ్.
3. అనంతపురం – కాంతిలాల్ దండే
4. విశాఖపట్నం – సౌరభ్ గౌర్
5. పార్వతీపురం మన్యం – కోన శశిధర్
6. పశ్చిమ గోదావరి – బాబు.ఏ
7. శ్రీ సత్యసాయి జిల్లా – యువరాజ్
8. చిత్తూరు – ఎం ఎం నాయక్
9. కర్నూలు – హర్షవర్దన్
10. నంద్యాల – పోలా భాస్కర్
11. శ్రీకాకుళం – ప్రవీణ్ కుమార్
12. బాపట్ల – ఎంవీ శేషగిరి బాబు.
13. అల్లూరి జిల్లా – కన్నబాబు.
14. తిరుపతి – సత్యనారాయణ
15. విజయనగరం – వినయ్ చంద్
16. అన్నమయ్య – సూర్య కుమారి
17. పల్నాడు – రేఖారాణి
18. కాకినాడ – వీర పాండియన్
19. నెల్లూరు – హరికిరణ్
20. అనకాపల్లి – చెరుకూరి శ్రీధర్
21. ప్రకాశం – గంధం చంద్రుడు
22. కడప – కేవీఎన్ చక్రధర్ బాబు
23. తూర్పు గోదావరి – హరి నారాయణ
24. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ – లత్కర్ శ్రీకేష్ బాలాజీరావు
25. కృష్ణా జిల్లా – విజయరామరాజు
26. గుంటూరు – మల్లిఖార్జునను నియమించింది ఏపీ ప్రభుత్వం.