APSRTC: దివ్యాంగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎస్కార్ట్కు 50 శాతం రాయితీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APSRTC: దివ్యాంగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం వారికి కల్పించింది.. అంతేకాదు.. ఇక, దివ్యాంగులతో ఎస్కార్ట్‌గా వచ్చేవారికి కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పించనున్నారు.. దివ్యాంగుల సంక్షేమం, సామాజిక సమగ్రతను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఇంద్రధనుస్సు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. APSRTC విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ ఉచిత రవాణా సౌకర్యం Rights of Persons with Disabilities Act, 2016 (RPWD Act 2016) సెక్షన్ 2 (ZC) కింద నిర్వచించబడిన దివ్యాంగులకు వర్తిస్తుంది.
Also Read
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ఏ బస్సుల్లో ప్రయాణం ఉచితం?
దివ్యాంగులు క్రింది 5 కేటగిరీల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు: సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.. అంతేకాదు.. వారికి ఎస్కార్ట్‌గా వచ్చేవారికి 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. మార్చి 18, 2026న ముఖ్యమంత్రి నారా చంద్రరబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకం అధికారికంగా ప్రారంభించబడుతుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తుంది. దివ్యాంగుల సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం, వారికి సులభమైన రవాణా సౌకర్యం కల్పించడం ఈ నిర్ణయంతో ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా వేలాది మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది.
తాజావార్తలు
-
Vladimir Putin: “రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు మోపారు”.. అమెరికా వైఖరిపై పుతిన్ ఫైర్..!
-
Houthis Capture Perim Island: సౌదీ అరేబియాకు భారీ షాక్.. పెరిమ్ ద్వీపంపై హౌతీల పట్టు, అరామ్కో పైప్‌లైన్‌కు నష్టం!
-
Manav Suthar Record: 131 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత స్పిన్నర్
-
418 Trailer: ఆ గదిలో అసలేం ఉంది? భయపెట్టేస్తున్న హారర్ థ్రిల్లర్ ‘418’ ట్రైలర్
-
Mangapatnam Train Accident: దేశంలోనే తొలి రైలు ప్రమాదం.. 71 మంది మృతి.. కడపలో 124 ఏళ్ల నాటి విషాదం
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?