NTV Telugu Site icon

CM Chandrababu Delhi Tour: ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన..!

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటన ముగిసింది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం.. ఢిల్లీలో ఈ రోజు మరికొంతమంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తారని ముందుగా ప్రచారం జరిగింది.. ముఖ్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై.. ఏపీకి రావాల్సిన బకాయిలను విడదల చేయాలని కోరనున్నారని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రారంభంలో రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలను కూడా కేంద్రం వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరే అవకాశం ఉందన్నారు.. మరోవైపు.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ జాప్యానికి అడ్డుగా ఉన్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరతారనే ప్రచారం కూడా సాగింది..

Read Also: Rottela Panduga: నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ.. విస్తృత ఏర్పాట్లు..

అయితే, హస్తినలో ఏపీ చంద్రబాబు.. ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్న ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.. మరోవైపు.. ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో ( 1, జనపధ్) మరికాసేపట్లో పూజలు నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత విజయవాడ బయల్దేరనున్నారు.. కాగా, మంగళవారం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు.. రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు.. పలు కీలక అంశాలపై హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు తెలుస్తుంది.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కేంద్ర సహాయం కోరారు.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను జాప్యం చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరారు సీఎం.. నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు, నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.. ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలు కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు, విభజన చట్టంలోనూ పలు పెండింగ్ అంశాలను కూడా సత్వరమే పరిష్కరించాలని.. విభజన చట్టంను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖ దేనని ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది..