NTV Telugu Site icon

AP Ration Mafia: రంగంలోకి సీఐడీ.. రేషన్‌ మాఫియాపై విచారణ షురూ..

Cid

Cid

AP Ration Mafia: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను కుదిపేస్తున్న బియ్యం అక్రమ రవాణా కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కాకినాడ తీరంలో రేషన్ బియ్యంతో స్టెల్లా నౌక పట్టుబడటం, అక్రమ రవాణా వెనుక యంత్రాంగం అలసత్వం, మాఫీయాను మించిన నెట్వర్క్ ఏర్పడిపేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న తీరుపై సీరియస్ అయ్యింది. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సమగ్ర విచారణ కోసం CBCID కి అప్పగించాలని నిర్ణయించింది. రేషన్ బియ్యం యధేచ్చగా ఇతర దేశాలకు తరలిపోవడం వెనక మిల్లర్లు., బడ వ్యాపారులప్రమేయాన్ని నిర్ధారించడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ దగ్గర వున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆరుగురు IPS ల సహకారంతో నేషనల్ హైవే మీద రేషన్ బియ్యం యధేచ్చగా తరలిపోయిన విషయం ఆధారాలతో సహా బహిర్గతం చేస్తామన్నారాయన.

Read Also: RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం

ఇప్పటికే కాకినాడు కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్లో అణువణువూ తనిఖీ జరుగుతుండగా CID ఎంట్రీపై ఆసక్తీ నెలకొంది. ఒక్క సివిల్ సఫ్లైశాఖ 729 మందిపై కేసులు పెట్టింది. 102 వాహనాలను సీజ్ చేసింది. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా… రౌడీ షీట్లు తెరుస్తామని సీరియస్‌ వార్నింగ్‌ ఇస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. బియ్యం దొంగల భరతం పట్టేందుకు ఏపీ సర్కార్ CID విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.. గతంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి రేషన్ బియ్యం దారి మళ్లించారని.. ఆరుగురు ఐపీఎస్‌లు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయని సర్కార్‌ చెబుతోంది. కాకినాడతో పాటు వివిధ పోర్టుల ద్వారా తరలిపోయిన బియ్యం లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది సీఐడీ.. ఇప్పటికే నాదెండ్ల మనోహర్‌ పలుమార్లు.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా రంగంలోకి దిగి.. నేరుగా పట్టుబడిన రేషన్‌ బియ్యాన్ని పరిశీలించడం.. అధికారుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడడంతో.. ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకుంది.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ విషయంపై చర్చించడం.. కేబినెట్‌లో కూడా ఈ అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.

Show comments