AP Cabinet: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

  • రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..
  • అమరావతి అభివృద్ధి కోసం మరో 20 వేల ఎకరాల భూసేకరణపై చర్చ..
  • నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే ఛాన్స్..
Cabinet

Cabinet

AP Cabinet: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతిలో 20, 494 ఎకరాల భూ సమీకరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే, నాలుగు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే ఛాన్స్ కూడా ఉంది. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి కేబినెట్ ఇవ్వనుంది. హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్‌కు ఆమోదం తెలపనున్న మంత్రి మండలి.

Read Also: Vem Narender Reddy: రాష్ట్రం వాళ్ల సొత్తు అన్నట్లు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోంది!

ఇక, ఏపీ రాజధాని అమరావతిలో అల్లూరి సీతరామరాజు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక చిహ్నాలు ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమ‌రావ‌తిలో ప‌లు సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం తెల‌ప‌నుంది. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కొత్తగా రెండు పట్టణాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నారు. జిల్లా యూనిట్ గా ‘ఉడా’లు ఉండేలా కొత్త ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.