AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై కీలక చర్చ..!

  • నేడు ఏపీ కేబినెట్ భేటీ..
  • అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ..
  • SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్..
Babu

Babu

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు (ఫిబ్రవరి 6) ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది.. నేటి ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ భేటీ కానుండగా.. మంత్రివర్గంలో కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.. విశాఖలోని పంచగ్రామాల సమస్యకు ఇప్పటికే పరిష్కారం సూచించిన కూటమి ప్రభుత్వం.. పంచ గ్రామాల భూములకు ప్రత్యమ్నాయంగా అదే విలువ కలిగిన భూములు కేటాయింపునకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఈ మేరకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడే ఛాన్స్ ఉంది. ఇక, స్టేట్ ఇన్వెస్ట్​మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB)లో ఆమోదించిన 44 వేల 776 కోట్ల రూపాయల విలువ చేసే 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలపనుంది మంత్రి మండలి.. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,580 మందికి ఉద్యోగా అవకాశాల కల్పనే ధ్యేయంగా పెట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం..

Read Also: Off The Record: ఆ ఎమ్మెల్యే రాసలీలలు గుట్టురట్టు వెనుక ఉన్నదెవరు..?

అయితే, ఈ నెల ఆఖరు వారంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై కేబినెట్‌ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఇక, రాష్ట్రంలో జరగనున్న రెండు గ్యాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి జగనునున్న ఎన్నికల వ్యూహాలపై ఆయా జిల్లాల మంత్రులు, ఇంఛార్జ్‌ మంత్రులతో చర్చిoచే ఛాన్స్ ఉంది. ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.