Site icon NTV Telugu

AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Key Decisions: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. ఆపరేషన్ సిందూర్‌ను అభినందిస్తూ ఏపీ కేబినెట్‌ తీర్మానం చేసింది.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన త్రివిధ దళాలకు అభినందనలు తెలిపింది.. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపింది కేబినెట్‌.. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.. ఇక, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చసాగగా.. తీరప్రాంత భద్రత, రక్షణరంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించారు.. మరోవైపు, ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.. అంటే, ఏపీ రాజధాని అమరావతి అని కేబినెట్‌ తీర్మానం తీసింది.. కేబినెట్‌ తీర్మానం కాపీని కేంద్రానికి పంపనుంది ఏపీ ప్రభుత్వం ..

Read Also: Rohit Sharma: అంతా చెత్త.. భారత్‌ కామెంటేటర్లపై రోహిత్ సంచలన వ్యాఖ్యలు!

మరోవైపు, ప్రధాని నరేంద్రమోడీ ఏపీ టూర్ లో ప్రధాన వేదిక పై సీటింగ్ ఏర్పాటు పై మంత్రి వర్గంలో చర్చకు వచ్చిందట.. కేంద్ర మంత్రులను ఒక వైపు.. ఏపీ మంత్రులను మరోపక్క కూర్చునేల ప్రోటోకాల్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్న సీఎం చంద్రబాబు. తన పక్కన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సీట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందన్నారు.. మరోసారి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని స్పష్టం చేశారు..

Read Also: PBKS vs MI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ధర్మశాల టు అహ్మదాబాద్‌!

ఇక, జలవనరుల శాఖ లో కంపెనీల చట్టం కింద జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.. చెరువుల్లో తవ్విన మట్టిని ఉచితంగా పొలాలకు తరలించేందుకు రైతులకు అనుమతి ఇస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. టీటీడీలో అర్బన్ డిజైన్ ప్లానింగ్ సెల్ ఏర్పాటు కు కేబినెట్ ఆమోదం తెలపగా.. టూరిజం ప్రాజెక్టులలోనూ ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహాలు అందించేదుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్‌..

Exit mobile version