Anna Canteens: ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం కానున్నాయి.. రాష్ట్రంలో కేవలం 5 రూపాయలకే పేదవాడి కడుపు నింపడం కోసం కూటమి సర్కార్ మళ్లీ అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు అన్న కాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 అన్న క్యాంటీన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 180 రెడీ అయ్యాయి.. ఇక, తొలి విడతలో 100 అన్న కాంటీన్లను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్నారు. అలాగే, మిగిలిన 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు.
Read Also: Stones In Kidney: కిడ్నీలో రాళ్లతో ఇబ్బందులా..? ఇలా చేయండి ఉపశమనం పొందండి..
కాగా, సెప్టెంబర్ 5వ తేదీన మరో 99 క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేసేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇకపోతే, అన్న క్యాంటీన్లలో ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు హరేకృష్ణ మూవ్‌మెంట్ అనే సంస్థ దక్కించుకుంది. కాగా, అన్న క్యాంటిన్ల యొక్క మెనూ అండ్ టైమింగ్స్ ను మనం పరిశీలిస్తే.. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు అన్న క్యాంటీన్లు కొనసాగుతాయి. రూ. 5 కే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ అందించనున్నారు. టిఫిన్ ఉదయం 7.30 నుంచి 10 గంటల మధ్య అందుబాటులో ఉండగా.. మధ్యాహ్నం లంచ్ 12.30 నుంచి 3 గంటల మధ్యలో ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి భోజనం 7.30 నుంచి 9 గంటల మధ్య అందించనున్నారు.
Read Also: Independence Day: 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
ఇవాళ కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారు.. ఎన్టీఆర్ తొలిసారి ప్రాతినిథ్యం వహించిన గుడివాడలోనే అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం కాబోతోంది.. పేదలతో కలిసి గుడివాడ అన్న క్యాంటీన్‌లో భోజనం చేయనున్న చంద్రబాబు. గుడివాడలో పేదలతో ఇంటరాక్ట్ కానున్నారు.. తొలి విడతలో 100 అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు.. అయితే, ఎన్నికల కోడ్ ఉన్నందున్న విశాఖలో ప్రారంభానికి నోచుకోవడం లేదు అన్న క్యాంటీన్లు. తొలి విడతలో మొత్తంగా 17 జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం..