SIR గడువు పొడిగింపు.. ఈసీ సవరించిన షెడ్యూల్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గడువును పొడిగించింది. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తుల మేరకు.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) చేసిన విజ్ఞప్తి, వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం, సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఏపీలో ఈ రోజుతో ముగియాల్సిన SIR ప్రక్రియను జూలై 24వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించింది.
కొత్త షెడ్యూల్..
సవరించిన షెడ్యూల్ ప్రకారం, బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) జూన్ 15 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా జూలై 24లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియ అనంతరం జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు ఓటరు జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అందిన దరఖాస్తులు, అభ్యంతరాలను జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు పరిశీలించి పరిష్కరించనున్నట్లు ఈసీ వెల్లడించింది.
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం అక్టోబర్ 3, 2026న ఆంధ్రప్రదేశ్ తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్రంలోని అన్ని ఎన్నికల అధికారులకు, రాజకీయ పార్టీలకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. అలాగే కొత్త షెడ్యూల్‌పై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించి, ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, తెలంగాణలోనూ ఈ నెల 24వ తేదీన SIR గడువు ముగియనున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?