Andhra Pradesh: మందు బాబులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- నకిలీ మద్యం అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు..
- క్యూఆర్ కోడ్ స్కానింగ్ జరిగిన తర్వాతే మద్యం అమ్మాలని నిబంధన..
- తనిఖీ వివరాలు రిజిస్టర్లో నమోదు చెయ్యాలని ఆదేశాలు..
- ఎక్సైజ్ శాఖ అధికారుల సంతకం తప్పనిసరి..
- నకిలీ మద్యం నివారణకు ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం వ్యవహారం కలకం సృష్టించింది.. దీంతో, మనం తాగేది అసలైనా లిక్కరేనా? నకిలీ తాగేస్తున్నామా? అనే అనుమానాలు మొదలయ్యాయి.. దీని ప్రభావం లిక్కర్ అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి.. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్‌శాఖ ఆదాయం తగ్గిపోయింది.. దీంతో, నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది ఏపీ సర్కార్.. నకిలీ మద్యం నివారణకు మరిన్ని చర్యలు చేపట్టింది.. మద్యం దుకాణాలు, బార్లలో నాణ్యమైన మద్యం అమ్మేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. నకిలీ మద్యం నివారణకు నిబంధనలు అమల్లోకి తెచ్చింది ఎక్సైజ్ శాఖ..
Read Also: Ilaiyaraaja : ఇళయరాజా స్టూడియోపై బాంబ్ బెదిరింపు – పోలీసులు అప్రమత్తం
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్‌న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో ముందుకు ఏపీ.. సింగపూర్‌లో చంద్రబాబు కీలక ప్రసంగం
ఇకపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేశాకే మద్యం అమ్మేలా నిబంధన.. పెట్టింది ఎక్సైజ్‌శాఖ.. ‘ఎక్సైజ్ సురక్షా యాప్’ ద్వారా మద్యం సీసాపై కోడ్ స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది.. ప్రతి దుకాణం, బార్ వద్ద ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.. విక్రయించే మద్యం నాణ్యమైనదని ధ్రువీకరించినట్లు బోర్డులు పెట్టాలని నిబంధనలు పెట్టింది.. మద్యం సీసాపై సీల్, క్యాప్, హోలోగ్రామ్, ప్రామాణికత తనిఖీ చేయాలని నిబంధనల్లో పేర్కొంది.. ప్రతి దుకాణం, బార్లో డైలీ లిక్కర్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశించింది.. ఎక్సైజ్ సిబ్బంది రోజూ మద్యం దుకాణాల్లో ర్యాండమ్‌గా తనిఖీ చేయాలని.. తనిఖీల వివరాలు దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది.. డిపో నుంచి మద్యం అందాక, కనీసం 5 శాతం సీసాలు స్కాన్ చేయాలని నిబంధన పెట్టింది.. తనిఖీల్లో నకిలీ మద్యం గుర్తిస్తే, ఎక్సైజ్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది..
మరోవైపు, నకిలీ మద్యం దొరికితే.. లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఎక్సైజ్ శాఖ.. నకిలీ మద్యంపై ఫిర్యాదులకు పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని పేర్కొంది.. ఫిర్యాదులను 24 గంటల్లో విచారించి నివేదించాలని ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా.. మొత్తంగా, నకిలీ మద్యం వ్యవహారంతో లిక్కర్‌కు దూరమవుతున్న వారిలో నమ్మకం కలిగించేలా.. తాము తాగేది అసలైన లిక్కరే అని తెలుసుకునే విధంగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఏపీ ఎక్సైజ్ శాఖ..
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?