AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై అధికార యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను దశలవారీగా నిర్వహించేలా ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం తొలుత రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. జూలై 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు డోర్ టూ డోర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై ప్రభుత్వ కార్యక్రమాలను వివరించే దిశగా ఈ ప్రచారం సాగనుంది. అదే సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను కూడా వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!