Amaravati Fire Accidents: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- అమరావతిలో అగ్నిప్రమాదాలపై సిట్ ఏర్పాటు..
- ఈ నెల 11న L&T, 23న మేఘా ఇంజినీరింగ్ వద్ద ఘటనలు..
- ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) నియామకం..
- గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Fire Accidents: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. అయితే, అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీన ఎల్ అండ్ టీ సంస్థ వద్ద, అలాగే 23వ తేదీన మేఘా ఇంజినీరింగ్ సంస్థ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలపై నిజానిజాలు వెలికితీయడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్‌ను నియమించింది.
Also Read
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
ఈ దర్యాప్తు బృందానికి గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వం వహించనున్నారు. బృందంలో నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉండగా, తుళ్లూరు సీఐ, డీఎస్పీ కూడా సభ్యులుగా ఉన్నారు. అదనంగా సాంకేతిక నిపుణుల సహకారంతో విచారణను మరింత లోతుగా కొనసాగించనున్నారు. అగ్నిప్రమాదాల వెనుక ఉన్న కారణాలు, ఏవైనా నిర్లక్ష్యాలు లేదా ఇతర అంశాలపై సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలపై సిట్ విచారణ ద్వారా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!