NTV Telugu Site icon

Amaravati Capital Works: అమరావతి రాజధాని పనులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Amaravati Capital

Amaravati Capital

Amaravati Capital Works: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనులపై కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే నెల అంటే ఏప్రిల్‌ 15వ తేదీ తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చింది.. ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించే ఆలోచనలో ఉంది కూటమి ప్రభుత్వం.. ఇక, అమరావతి రాజధాని పునఃనిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, సచివాలయం వెనక వైపు ప్రాంతంలో రాజధాని పనులు ప్రారంభించాలని.. అదే ప్రాంతంలో సభ కూడా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చూడాల్సిందిగా సీఆర్డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..

Read Also: Nag Ashwin: నాని – విజయ్‌ దేవరకొండ వివాదాలపై నాగ్ అశ్విన్ రియాక్షన్..

కాగా, కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ఫోకస్‌ పెట్టింది.. ఇప్పటికే పలు రకాల పనులకు సీఆర్డీఏ అనుమతి ఇవ్వడం.. దానికి కేబినెట్‌ సమావేశ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిపోయాయి.. అయితే, ఇవాళ సీఆర్డీఏ అధికారుల‌తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశానికి మంత్రి నారాయ‌ణ‌తో పాటు సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు.. ప్రధాని న‌రేంద్ర మోడీ అమ‌రావ‌తి ప‌ర్యట‌న‌పై ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు.. అమ‌రావ‌తి ప‌నుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప‌ర్యట‌న.. రాజధాని పనుల పునఃప్రారంభానికి సంబంధించిన స్థలం ఎంపిక‌, ముహూర్తం, ఇత‌ర ఏర్పాట్లపై అధికారుల‌తో సీఎం ప్రిలిమిన‌రీ స‌మావేశం నిర్వహించారు.. ఇక, ప్రధాని మోడీ టూర్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.. అమరావతి రాజధాని రీ లాంచ్ కు ప్రధాని మోడీ రాబోతున్నారు.. వచ్చే నెల రెండో వారంలో అమరావతిలో పర్యటించనున్నారు మోడీ.. మొత్తంగా ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనక ప్రాంతంలో రాజధాని పనుల రీ లాంచ్.. అదే ప్రాంతంలో ప్రధాని బహిరంగ సభ నిర్వహించేలా వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఆర్డీఏ సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..