Amaravati Capital Bill: అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital Bill: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. “ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు”కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందగా, నిన్న లోక్‌సభలోనూ ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందిన ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి పంపబడనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారికంగా చట్టబద్ధత పొందనుంది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఉన్న అనిశ్చితి తొలగిపోవడం పట్ల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Read Also: Rajnath Singh: 22 నిమిషాల్లోనే కాళ్ల బేరానికి పాకిస్తాన్, మళ్లీ కుట్రలకు ప్రయత్నిస్తే..
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
రాజ్యసభలో ఈ బిల్లుపై జరిగిన చర్చ అనంతరం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఏపీ రాజధాని అంశంపై ఉన్న అస్పష్టత పూర్తిగా తొలగిపోయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాభినందనలు తెలిపారు. ఇక, రాజ్యసభ విజిటర్స్ గ్యాలరీలో ఈ చర్చను వీక్షించిన ఏపీ మంత్రి నారా లోకేష్, ఇతర ఎంపీలు బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆనందాన్ని పంచుకున్నారు. “జై అమరావతి” నినాదాలతో ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కౌగిలించుకుని, బిల్లు పై ఆయన చక్కగా మాట్లాడారని అభినందించారు. మొత్తంగా, అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్‌సభ, రాజ్యసభలు ఏకగ్రీవంగా ఆమోదించడం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత అమరావతి రాజధాని హోదా అధికారికంగా స్థిరపడనుంది.
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!