Man Kills Father: కనిపెంచిన కన్నతండ్రినే కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. కిరాతకంగా పదునైన ఆయుధంతో పొడిచి తండ్రిని హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టిన ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన 60 ఏళ్ల తండ్రిని హత్య చేసి మృతదేహాన్ని తన ఇంట్లో పాతిపెట్టాడని పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు చున్నీలాల్ తన తండ్రి రాజేంగ్ బరాండాతో బుధవారం తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. రాజేంగ్ బరాండా అక్కడికక్కడే మరణించాడు. చున్నీ లాల్ మృతదేహాన్ని అతని ఇంటి ప్రాంగణంలోనే పాతిపెట్టాడని పోలీసులు తెలిపారు.
Read Also: Asia’s Largest Tulip Garden: తెరుచుకున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
మృతుడికి ప్రకాష్, దినేష్, పప్పు, చున్నీలాల్ అనే నలుగురు కుమారులు ఉన్నారు. ప్రకాష్, అతని తల్లి అహ్మదాబాద్‌లో నివసిస్తుండగా, ఇతర తోబుట్టువులు దుంగార్‌పూర్‌లోని బల్వారా గ్రామంలో నివసిస్తున్నారని, బరాండా చున్నీ లాల్‌తో కలిసి ప్రత్యేక ఇంట్లో నివసించారని పోలీసులు వెల్లడించారు. గత రెండు రోజులుగా తమ తండ్రి కనిపించడం లేదని దినేష్, పప్పు, ప్రకాష్‌కు ఫోన్ చేశారు. ప్రకాష్ తన తల్లితో కలిసి గ్రామానికి వచ్చి చున్నీలాల్‌తో తలపడ్డాడు. మొదట్లో, చున్నీ లాల్ తనకు ఏం తెలియదని గొడవకు దిగాడు. కానీ శుక్రవారం అతన్ని చంపినట్లు అంగీకరించాడు. ఆ తర్వాత ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మృతదేహాన్ని ఇంటి ప్రాంగణం నుంచి వెలికితీసి జిల్లా ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు చెప్పారు. ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేసి చున్నీ లాల్‌ను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.