ఏపీలో అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలను ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే విద్యా సంవత్సరానికి చెందిన డబ్బులను జూన్ నెలలో జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ పథకం లబ్ధిదారులు తమ ఆధార్‌ను గ్రామ, వార్డు సచివాలయాల్లో బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో అమ్మఒడికి సంబంధించి విద్యార్థుల తల్లి ఆధార్ నెంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ నెంబర్‌ను మాత్రమే నమోదు చేయాలని కీలక సూచన చేసింది. మరోవైపు వివరాలను కూడా సరిచూసుకోవాలని విద్యార్థులకు హితవు పలికింది.
కాగా ఇప్పటికే అమ్మ ఒడి పథకం డబ్బులు రావాలంటే 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయుడు ఆన్లైన్లో విద్యార్థుల హాజరు వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. యాప్‌లో ప్రతి రోజూ విద్యార్థుల హాజరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అమ్మ ఒడి పథకానికి గత ఏడాది నవంబర్ 8 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉండే హాజరును అధికారులు ప్రామాణికంగా తీసుకోనున్నారు. మరోవైపు అమ్మ ఒడి పథకాన్ని కుటుంబంలో ఒకరికే ఇస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని పలువురు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
https://ntvtelugu.com/central-government-released-879-crores-funds-to-ap-under-revenue-deficit-grant/