Deputy CM Pawan: ఏనుగుల బెడద నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో AI ఆధారిత సిస్టమ్ ప్రారంభం చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మనుషులు అడవి ఏనుగుల మధ్య సంఘర్షణను తగ్గించే నూతన AI సిస్టమ్ ఆవిష్కరణ చేశారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చొరవతో వన్యప్రాణుల సంరక్షణ & గ్రామస్థుల రక్షణకు డ్యూయల్ మోడల్ అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు దార్శనికతలో ముందడుగు వేశాం.. చిత్తూరు సరిహద్దు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభినట్లు పేర్కొన్నారు.
Read Also: Kollywood : డైరెక్షన్ నుండి హీరోలుగా మారుతున్న యంగ్ దర్శకులు
అయితే, AI + మిషన్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థ ఏనుగుల సంచారాన్ని రియల్ టైమ్‌లో గుర్తిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఏనుగుల రాకను గుర్తించిన వెంటనే అటవీశాఖకు హెచ్చరికల్ని పంపే అలర్ట్ మెకానిజం తెచ్చాం.. సౌరశక్తితో పని చేసే వ్యవస్థ విద్యుత్ అవసరం లేకుండానే 24×7 పర్యవేక్షణ ఉంటుంది.. ఏనుగులను స్వల్పంగా భయపెట్టి గ్రామాల వైపు దారి మళ్లకుండా నిరోధించేలా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాం.. 60 మీటర్ల పరిధిలో 120° కోణంలో కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది.. పంట నష్టం, గ్రామాల భద్రతల సమస్యలకీ సమగ్ర పరిష్కారం లభించిందన్నారు. కర్ణాటక నుంచి తీసుకొచ్చిన 4 కుంకీ ఏనుగులు ఇప్పటికే విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించాయని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు.