Dance in ClassRoom: క్లాస్ రూమ్‌లో డ్యాన్స్‌లు.. 8 మంది విద్యార్థులపై చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్లాస్ రూమ్‌లో సరదాగా ఉండాలి, లెక్చరర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలి.. లెక్చరర్ లేని సమయంలో.. క్లాస్‌రూమ్‌లో అల్లరి చేయడం ఎక్కడైనా జరిగే తంతుయే కావొచ్చు.. కానీ, అది ఏ మాత్రం శృతిమించకూడదు.. విద్యార్థుల భవిష్యత్‌పై దాని ప్రభావం పడుతోంది.. ఇప్పుడు కాకినాడలో అదే జరిగింది.. క్లాస్‌రూమ్‌లో పిచ్చి డ్యాన్స్‌లు వేయడమే కాదు.. ఆ వీడియోను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.. ఒక్కరు, ఇద్దరు.. ఆ తర్వాత ముగ్గురు.. ఆ తర్వాత పెద్ద గ్యాంగ్ ఇలా.. అంతా చేరి పిచ్చి స్టెప్పులు వేసింది.. ఆ వీడియో కాస్తా కాలేజీ యాజమాన్యం వరకు వెళ్లడంతో.. ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు.. ఆ విషయం తల్లి దండ్రుల వరకు వెళ్లడంతో.. విద్యార్థుల భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?
Also Read
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
కాకినాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్లాస్ రూమ్‌లో కొందరు విద్యార్థులు.. పిచ్చి చేష్టలు చేశారు.. ఇష్టం వచ్చినట్టు స్టెప్పులు వేశారు.. చూసేవారికే ఆ స్టెప్పులు ఇబ్బంది కరంగా ఉన్నాయి.. ఆ స్టెప్పులను వీడియో చిత్రీకరించడంతో.. అది కాస్తా యాజమాన్యం వరకు వెళ్లింది.. దీంతో, 8 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం.. అయితే, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడిన విద్యార్థులు.. వారం గడిచినా.. ప్రతీరోజు కాలేజీకి వెళ్లి వస్తూనే ఉన్నారు.. దీనిపై విద్యార్థులను సస్పెండ్ చేసి తొమ్మిది రోజులు అవుతున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు కాలేజ్ కి వెళ్లి తిరిగి వస్తున్నారని, వారు మానసికక్షోభకి గురవుతున్నారని.. విద్యార్థి తల్లి వాయిస్ మెసేజ్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.. పిల్లలు ఏమైనా చేసుకుంటే కాలేజ్ యజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
తాజావార్తలు
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!