Ali: వచ్చే ఎన్నికల్లో పోటీ.. మరోసారి ఆలీ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ali: రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 175కి 175 స్థానాల్లో విజయమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.. కొన్ని చోట్ల సిట్టింగ్‌లకు షాక్ తప్పదనే ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో.. ఈసారి మాకు అవకాశం వస్తుందని ఎదురుచూసేవాళ్లు లేకపోలేదు.. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు ఆలీ.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆర్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఆలీ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడు రాష్ట్రాల నుండి టీమ్స్ ను తీసుకువచ్చి రాజమండ్రిలో ఆర్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కొన్ని వందల సినిమాలు షూటింగ్ జరిగాయని గుర్తుచేశారు. ఇక, ఇదే సమయంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ.. మా నాయకుడు ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.. ఎక్కడ పోటీ చేస్తాం అనే దానిపై పుకార్లు అనేవి సాధారణంగా జరుగుతూ ఉంటాయని వ్యాఖ్యానించారు ఆలీ.
Read Also: Lata Mangeshkar: ఈ లెజెండ్ మొదటి సంపాదన 101/-
Also Read
- Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
- TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
- Bhumana Karunakar Reddy: ఎంపీలపైనే దాడులు చేస్తారా? దమ్ముంటే ఎన్నికల్లో గెలవండి.. భూమన సవాల్
- AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
కాగా, ఈ మధ్యే ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారుగా ఆలీని నియమించారు సీఎం వైఎస్ జగన్.. గతంలోనో ఎన్నికల్లో పోటీపై హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్ధమంటూ తిరుపతిలో వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఎక్కడి నుంచైనా పోటీకి తాను రెడీ అన్నారు. పవన్ కల్యాణ్ తనకు మంచి స్నేహితుడని, అయితే సినిమాలు వేరు, రాజకీయాలు వేరని ఆలీ చెప్పుకొచ్చిన విషయం విదితమే.. మొత్తంగా ఆలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ ఆదేశిస్తే.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో, ఆలీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అది కూడా పలానా నియోజకవర్గం అంటూ ప్రచారం జోరుగా సాగుతోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR – Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!