Ali: రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. 175కి 175 స్థానాల్లో విజయమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.. కొన్ని చోట్ల సిట్టింగ్‌లకు షాక్ తప్పదనే ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో.. ఈసారి మాకు అవకాశం వస్తుందని ఎదురుచూసేవాళ్లు లేకపోలేదు.. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు ఆలీ.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆర్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు ఆలీ..…