A Young Boy Misbehaved with a Student: ఓ హైస్కూల్ విద్యార్థినిని ఓయువకుడు అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. సినిమా తరహా ఓ యువకుడు ఓ మైనర్ బాలిక వద్దకు వచ్చి అందరు చూస్తుండగానే అమెను లాక్కుని బహిరంగంగా ముద్దు పెట్టి అక్కడనుంచి పరార్ అయ్యాడు. ఈ సంఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండంలో పార్లపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
read also: Minister Gummanur Jayaram: కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్..!
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండంలో పార్లపల్లిలో ఓ హైస్కూల్ వద్ద టెన్త్ చదివే విద్యార్థిని పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బైక్ పై వచ్చి విద్యార్థినిని లాగి హత్తుకొని బలవంతంగా ముద్దు పెట్టాడు ఓ యువకుడు. తోటి విద్యార్థినులు తిరగబడడంతో ఆ యువకులు పరారయ్యారు. విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన జరిగి రెండు రోజులైనా పోలీసులు కేసు నమోదు చేయలేదు. కారణం ఆయువకుడికి స్థానిక నేతలు జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. ఆ యువకుడిపై కేసు నమోదు చేయకుండా స్థానిక నేతలు జోక్యం చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఓక మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించినా బయటకు రాకుండా పోలీసులకు సైతం యువకుడిపై చర్యలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం పై మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఓహైస్కూల్ విద్యార్థినిని పోలీస్టేషన్ మెట్లెక్కిన ఆమైనర్ బాలికకు న్యాయం చేయకుండా నేతలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా హైస్కూల్ ముందే జరిగినా పాఠశాల యాజమాన్యం సైతం స్పందించకపోవడం గమనార్హం. పిల్లలపై శ్రద్ద వహించాల్సిన పాఠశాల యాజమాన్యం సైతం నిమ్మకు నీరత్తకుండా వుండటం సర్వత్రా చర్చకు దారితీస్తుంది. అయితే దీనిపై అధికారులు ఎలా స్పందించనున్నారు. ఆమైనర్ బాలికకు న్యాయం జరుగుతుందా? అనే కోణంలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు స్థానికులు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో?.
Electric Vehicles: ఎలక్ట్రిక్ బైక్ అగ్ని ప్రమాదాలకు ఈ లోపాలే కారణం.. నిపుణుల కమిటీ గుర్తింపు