Hindu Funeral Rites: నా భార్య అస్థికలు పోయాయి.. దయచేసి తెచ్చివ్వండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Lawyer Filed Case To Bring Back His Wife Asthikalu: అప్పుడప్పుడు పోలీసులకు వింత ఫిర్యాదులు అందుతుంటాయి. అసలు ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయా? అంటూ పోలీసులే కాదు, యావత్ ప్రజానీకం కూడా నివ్వెరపోయేలా కొందరు అనూహ్యమైన కంప్లైంట్స్‌తో పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారు. ఇప్పుడు అలాంటి వింత ఘటనే తాజాగా వెలుగు చూసింది. తన భార్య అస్థికలు పోయాయంటూ.. ఒక న్యాయవాది పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు హాట్ టాపిక్‌గా మారింది. ఎలాగైనా తన భార్య అస్థికలు తెచ్చివ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న కోడూరి వెంకటేశ్వరరావు భార్య వెంకటలక్ష్మి ఈనెల 14వ తేదీన మృతి చెందారు. దీంతో 15వ తేదీన పాలకొల్లు కైలాసవనంలో అంత్యక్రియలు నిర్వహించారు. 16వ తేదీన ఒక చిన్న కార్యక్రమం జరిపాక.. అస్థికలను భద్రపరచమని కాటి కాపరికి ఇచ్చారు. ఈరోజు ఉదయం అస్థికలను గోదావరిలో కలపాలనుకున్న వెంకటేశ్వరరావు.. అస్థికలు తీసుకునేందుకు కైలాసవనానికి వెళ్లారు. కాటికాపరికి అస్థికలు ఇవ్వమని అడిగారు. అయితే.. కాటికాపరి అస్థికలు కనిపించడం లేదని, ఎక్కడో పోయాయని షాకిచ్చాడు. అలా ఎలా పోతాయంటూ కాటికాపరితో వాగ్వాదానికి దిగారు. ఎక్కడా వెతికినా దొరక్కపోవడంతో.. ఆయన పోలీసుల్ని ఆశ్రయించారు. తన భార్య అస్థికలు పోయాయని, దయచేసి వాటిని తెచ్చివ్వమని వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
తాజావార్తలు
-
Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్‌లో కొత్త టూరిజం హబ్
-
Lunar Eclipse 2026: ఆ ఏడాది చంద్రగ్రహణం: సమయం, ప్రభావాలు, చేయాల్సిన పనులు ఇవే
-
Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
-
TOXIC : టాక్సిక్ టాక్ ఏంటి.. డే-1 ఈ కలెక్షన్స్ ఏంటి?
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఉగ్ర దేశ జాబితా నుంచి ఆ దేశం తొలగింపు
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?