Love Tragedy: తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఓ ప్రేమజంట ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలను అమ్మాయి తరపు బంధువులు బలవంతంగా తీసుకెళ్లారు. బాలాయపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన పెంచలయ్య, త్రివేణిల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది. గత 3 నెలల క్రితం ఇంట్లో నుంచి ఈ ప్రేమ జంట పారిపోయింది. బాలాయపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసిన అమ్మాయి సోదరుడు మహేష్.. ఇరువురూ మేజర్లు కావడంతో కౌన్సిలింగ్ చేసి పంపిన పోలీసులు.. కొన్ని రోజుల అనంతరం మళ్లీ పారిపోయిన ప్రేమ జంట.. వీరి ఆచూకీ కోసం అబ్బాయి అన్న వదినలైన అంకయ్య, కృష్ణవేణిలను అమ్మాయి బంధువులు తీసుకెళ్లారు.
Read Also: KBR Park: కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్.. త్వరలో అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ల నిర్మాణం..
ఇక, అమ్మాయి తమ్ముడు మహేష్, ఆమె మేనమామలే తీసుకెళ్లారనే ఆరోపణలు వస్తున్నాయి. నాయుడుపేట ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై వెంకటగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కిడ్నాప్ కు పాల్పడిన నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.