Rajya Sabha: ఈ ఏడాది మార్చ్ నుంచి నవంబర్ మధ్య 73 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఇక, దీనిపై రాజ్యసభ సచివాలయం శుక్రవారం నాడు బులిటెన్ విడుదల చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది, మహారాష్ట్ర నుంచి ఏడుగురు, తమిళనాడు నుంచి ఆరుగురు, పశ్చిమ బెంగాల్, బీహార్ నుంచి ఐదుగురి చొప్పున ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి నలుగురి చొప్పున, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ల నుంచి ముగ్గురి చొప్పున, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, హర్యానా, ఝార్ఖాండ్ ల నుంచి ఇద్దరి చొప్పున, హిమాచల్ దేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్త రాఖండ్ల నుంచి ఒక్కొక్కరి చొప్పున పదవీ విరమణ చేయనున్నారు.
Read Also: Bandla Ganesh: బండ్ల సంచలనం..బాబు కోసం షాద్‌నగర్ టు తిరుమల ‘మహా పాదయాత్ర’!
తెలుగు రాష్ట్రాల నుంచి వీరే:
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైసీపీ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబో స్ తో పాటు టీడీపీ సభ్యుడు సానా సతీష్ బాబు ఈ జాబితాలో ఉన్నారు. ఇక, ఈసారి ఏపీ నుంచి నాలుగు స్థానాలు కూటమి ప్రభుత్వానికి దక్కనున్నాయి. కాగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కేశవరావు రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పదవీ విరమణ చేస్తారు. ఇక, తెలంగాణలో రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడానికి అవకాశం ఉంది.