20 Lakh Robbery In Guntur Mirchi Company: గుంటూరులో ఒక భారీ దోపిడీ చోటు చేసుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం ఒక కంపెనీలో చొరబడి.. అక్షరాలా రూ. 20 లక్షలు దోచేసుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు ఓ కుక్క ప్రయత్నించగా.. దానికి కోడిమాంసం తినిపించి, దాని నోరు మూయించేశారు. దీంతో వారి పని మరింత సులభం అయ్యింది. వాచ్‌మన్ కూడా ఒక్కడే ఉండటంతో.. వాళ్లను ఎదుర్కోలేక, పాపం మౌనంగా ఉండిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Famous Gilded House: నీ ఇల్లు బంగారం కాను.. అవును ఆ ఇళ్లంతా బంగారమే!
గుంటూరులోని వెంకటప్పయ్య కాలనీలో లాల్‌పురం రోడ్డు చివరన ఒక మిర్చి కంపెనీ ఉంది. ఇక్కడి నుంచి మలేసియాతో పాటు మరికొన్ని దేశాలకు మిర్చి ఎగుమతులు చేస్తుంటారు. ఈ కంపెనీపై కన్నేసిన ఇద్దరు దొంగలు.. ఎవ్వరూ లేని సమయం చూసుకొని, గత అర్థరాత్రి బైక్‌పై అక్కడికి చేరుకున్నారు. తొలుత అక్కడ వాచ్‌మన్‌గా పని చేస్తున్న ఆవులయ్యను కట్టేశారు. అరిచినా, తప్పించుకోవడానికి ప్రయత్నించినా.. చంపేస్తామని వాళ్లు బెదిరించడంతో, వాచ్‌మన్ కిమ్మనకుండా మౌనంగా ఉండిపోయాడు. అనంతరం ఆ ఇద్దరిలో ఒక దొంగ కంపెనీ ఆఫీస్ రూమ్ తాళం పగలగొట్టి, లోనికి వెళ్లి, అక్కడున్న డబ్బుని దోచుకున్నాడు.
Meruga Nagarjuna: దగా చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.. ఆయన శకం ముగిసింది
డబ్బు దొరకడంతో.. వాళ్లు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే.. కంపెనీ నుంచి బయటకు వస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఓ కుక్క వారిని చూసి అరిచింది. అప్పుడా దొంగలు తమతో పాటు తెచ్చుకున్న చికెన్ దానికి వేశారు. అది చికెన్ తినడంలో బిజీ అయ్యింది. అదే అదునుగా.. ఆ దొంగలు అక్కడి నుంచి సన్నగా జారుకొని, బైక్‌పై పారిపోయారు. ఈ దోపిడీపై కంపెనీ యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూ. 20 లక్షలకు పైగా నగదు పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.