NTV Telugu Site icon

Amalapuram Violence: ఏడు కేసులు నమోదు.. 46 మంది అరెస్ట్‌..

Amalapuram Violence

Amalapuram Violence

అమలాపురంలో విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలను గుర్తించేపనిలో పడిపోయారు పోలీసులు.. ఇప్పటికే వెయ్యి మందికి పైగా గుర్తించినట్టుగా తెలుస్తుండగా… ఈ ఘటనలో 7 కేసులు నమోదు చేశామని.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. నిన్నటి ఘటనకి సంబంధించిన 7 కేసులు నమోదు అయ్యాయన్న ఆయన.. ప్రస్తుతం 1000 మందిని గుర్తించినట్టు తెలిపారు.

Read Also: Konaseema Violence: అమలాపురం విధ్వంసం.. వారిని గుర్తించేపనిలో పోలీసులు..!

ఇక, చలో రావులపాలెంకి సంబంధించిన సమాచారం కూడా మా దగ్గర ఉందని తెలిపారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.. ఇప్పటికే అక్కడ పోలీసు బలగాలను మోహరించామని.. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితి అదుపులో ఉందన్నారు. మరోవైపు కోనసీమ జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 144, 30 యాక్ట్‌లు అమలులో ఉన్నాయన్నారు. కాగా, నిన్న చోటుచేసుకున్న విధ్వంస ఘటనలు, ఇవాళ కూడా ఆందోళనలకు పిలుపులు ఉండడంతో.. అప్రమత్తమైన పోలీసులు.. అమలాపురంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అమలాపురం వచ్చేవారి వివరాలను సేకరిస్తున్నారు.. బస్సు సర్వీసులను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.