సంచయితపై అశోక్ గజపతి వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో బాబాయ్ వర్సెస్ అమ్మాయిలా రాజకీయం నడుస్తోంది. సంచయిత గజపతి పై వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి ప్రస్తుత సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు. సంచయిత గజపతిరాజుని ఇల్లీగల్ చైర్మన్ గా వ్యాఖ్యానించారు అశోక్ గజపతి. ఈరోజు జరిగిన సమావేశంలో 12 అంశాలకు గాను 11 అంశాలను ఆమోదించామని అశోక్ గజపతిరాజు తెలిపారు.
ఒక అంశాన్ని పరిశీలించి చర్చించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆ సింహాద్రి అప్పన్నకు సేవ చేయాలని ఆయన కోరారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా సంచయితను తొలగించి కోర్టు తిరిగి అశోక్ గజపతిరాజుని నియమించిన సంగతి తెలిసిందే.
Also Read
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆడపిల్లకు హక్కులు వస్తాయని కొందరు మంత్రులు కన్ఫ్యూజ్ అయ్యారు. రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు ఆస్తి పంపకాల్లో విభేదాలు ఉండరాదని సమాన హక్కులు వుండాలని అప్పుడు అన్నగారు ఇచ్చారు . కానీ ట్రస్ట్ వేరు, ప్రైవేట్ ప్రాపర్టీ వేరు…ట్రస్టు ప్రభుత్వ ఆస్తుల అంటూ కొందరికి కన్ఫ్యూజ్ వస్తుంది. మాన్సాస్ ట్రస్టు విషయంలో భక్తులు దేవుడికి ఇచ్చింది అవుతుంది.ఇది ప్రభుత్వ ఆస్తి కాదు. గతంలో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు ఈ విషయం చెప్పింది. మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం ఒక రెగ్యులేటర్ గానే పనిచేస్తుంది….ఓనర్ కాదు.
ప్రభుత్వం పాత్ర ఏంటి అనేది స్పష్టంగా ఉంది . రాష్ట్రంలో ఆనవాయితీగా వున్న టెంపుల్స్ 230 వరకు ఉన్నాయి.కావాలంటే వాటికి ప్రభుత్వం ఫౌండర్ మెంబర్స్‌గా మొత్తం మహిళలకే ఇవ్వొచ్చు. సింహాచలం దేవస్థానం భూములను ఒక పాలసీ ప్రకారం ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. నాకు ఎవరితోనూ వ్యక్తిగత కక్ష లేదు.అందరితో పని చేస్తా అన్నారు అశోక్ గజపతి. ధర్మకర్తగా నాకు అధికారులకు మధ్య భవిష్యత్తులో విభేదాలు రాకూడదన్నారు. మాన్సాస్ ఈవో ను నేను వెళ్ళి కలుస్తాను అపాయింట్మెంట్ ఇమ్మంటే ఆ పెద్దమనిషి నాకు టైమ్ ఇవ్వడంలేదు. ఈరోజు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ద్వారా గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి అనేవి కొంతవరకు తెలిశాయి. రికార్డులలో కొన్ని తేడాలు ఉన్నాయి. భక్తులు సౌకర్యాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి.. దానిపై హోవర్క్ చేసి అన్ని కోణాల నుండి రిపోర్ట్స్ తెప్పించుకోవాలన్నారు.
పైడి తల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి తనను ఆహ్వానించలేదని సంచయిత మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద బాబాయ్ వర్సెస్ అమ్మాయి కామెంట్లు రచ్చరేపుతున్నాయి.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!