Girl Traced With Free WiFi: ఇంటినుంచి పారిపోయిన అమ్మాయి.. పట్టించిన ఫ్రీ వైఫై..!
- ఇంటి నుంచి అలిగి వెళ్లిన అమ్మాయిని పట్టించిన ఫ్రీ వైఫై..
- పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ మిస్టరీ సుఖాంతం..
- చదువుపై తల్లి మందలించడంతో అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి..
- సిమ్ తీసేసి, ఆచూకీ దొరకకుండా జాగ్రత్త..
- కేవలం రైల్వే వైఫైతోనే నెట్టుకొచ్చిన హారిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Traced With Free WiFi: అలిగి ఇంటినుంచి వెళ్లిపోయిన అమ్మాయిని ఫ్రీ వైఫై పట్టించింది.. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి నుంచి అలిగి వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థిని హారిక మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. చదువుపై తల్లి మందలించడంతో ఆవేశంలో పరీక్ష ఉందని ఇంటి నుంచి బయటకు వెళ్లిన హారిక.. ఆ తర్వాత అదృశ్యమైంది. అయితే, తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు పోలీసులు, 12 రోజుల పాటు ఆమె ఆచూకీ కోసం వెతికారు.
Also Read
తాను ఉన్న లొకేష్ దొరకకూడదని భావించి హారిక తన మొబైల్‌లో ఉన్న సిమ్ కార్డ్‌ను తీసేసి, ఎలాంటి కాల్ ట్రేసింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయినా ఆమె ప్రయాణం మాత్రం ఆగలేదు. బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి నగరాల్లో తిరుగుతూ, కేవలం రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఫ్రీ వైఫై ఆధారంగా ఇన్‌టర్నెట్ వాడుతూ ముందుకు సాగింది.. అయితే, ఫ్రీ వైఫై లాగిన్‌తో కేసు ఛేదించారు పోలీసులు.. సిమ్ లేకపోయినా, పబ్లిక్ వైఫై లాగిన్ డేటాతో ఆమె లొకేషన్ ట్రేస్ చేయగలిగింది పోలీసుల టెక్నికల్ టీమ్. ఒక్కొక లొకేషన్‌ను వెరిఫై చేయడం ద్వారా హారిక ప్రయాణ మార్గాన్ని అంచనా వేసి.. చివరకు ఆమెను రాజమండ్రి పరిసరాల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇక, హారిక ఆచూకీ కనుగొన్న తర్వాత, ఆమె ఇంటికి రానంటూ మొండికేసింది.. దీంతో, పోలీసులు కౌన్సిలింగ్ చేసి నచ్చజెప్పి, ఆమెను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన టెక్నికల్ టీమ్‌ను ఎస్పీ అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లలతో మాట్లాడి, భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క శెట్టి సినిమాలకు ఇక గుడ్‌బై చెప్పేసినట్టేనా?
-
Sailesh Kolanu: సుహాస్ నన్ను మోసం చేశాడు..!
-
Huawei Mate XT 2: హువావే మేట్ XT 2 ట్రై-ఫోల్డ్ 5G ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. 16GB RAM, 2TB స్టోరేజ్, 6000mAh బ్యాటరీ!
-
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
-
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21 కోట్ల జరిమానా!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!