Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం మామిడి పంచాయతీ పరిధిలో ఏనుగుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. పూరిగానివలస గ్రామ సమీపంలోని పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల గుంపు చక్కర్లు కొడుతుండటంతో రైతులు, కూలీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా సరిహద్దుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఏనుగుల కదలికలు పెరిగాయి.
ఏనుగుల సంచారం నేపథ్యంలో మామిడి పంచాయతీతో పాటు పరిసర గ్రామాల ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో తోటల వద్దకు వెళ్లరాదని, ఏనుగులు కనిపించిన వెంటనే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు గుంపులుగా ప్రయాణించాలని, ఏనుగులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. మామిడి పంచాయతీకి చెందిన రైతు రామారావు పామాయిల్ తోటలోకి ప్రవేశించిన ఏనుగులు డ్రిప్ ఇరిగేషన్ పైపులను ధ్వంసం చేశాయి. దీంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది.
Also Read
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ఏనుగుల భయంతో పామాయిల్ తోటల్లో పనులు చేసేందుకు కూలీలు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో పండిన పామాయిల్ గెలలను కోయడం, వాటిని మార్కెట్‌కు తరలించడం కూడా కష్టసాధ్యంగా మారిందని గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఏనుగుల సంచారం రైతులకు కొత్త సమస్యగా మారిందని వారు వాపోతున్నారు. ఏనుగుల గుంపు ఇంకా తోటల పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!