సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలను కూడా పండిస్తున్నారు.. అందులో కొబ్బరిని కూడా ఎక్కువగా పండిస్తున్నారు.. అందులో అంతర పంటలను కూడా పండిస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. కోస్తా ఆంధ్రా జిల్లాల్లో కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. అయితే కొబ్బరిలో అంతరపంటలు కల్పతరువుగా మారాయి.. వక్క, అల్లం, మిరియాలు, పసుపును అంతరపంటలుగా వేసి అదనపు ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కొబ్బరిలో ఈఏడాది వక్క ద్వారా 3 లక్షల పైగా ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు..
మరికొందరు మాత్రం కొబ్బరి చెట్లకు మిరియాల తీగలను పాకించి మిరియాలును పండిస్తున్నారు.. అధిక లాభాలను పొందడానికి అంతర పంటలను పండిస్తున్నారు ఉభయగోదావరి జిల్లావాసులు..కేరళ తరువాత కొబ్బరి ఎగుమతులు చేసేది మన రాష్ట్రమే. ఇందులో పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలదే అగ్రస్థానం. అంతేకాకుండా కొబ్బరిపై అనేక పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. రోజురోజుకు కొబ్బరి సాగు తగ్గుతోంది.. దాంతో రైతులు వక్క ను అంతర పంటగా సాగు చేస్తున్నారు..
కొబ్బరిలో ఒక్క పంట కాకపోయినా రెండు మూడు రకాల పంటలను వేసుకుంటే ఒక్క పంట కాకపోయినా మరో పంట ద్వారా అయినా ఆదాయాన్ని పొందవచ్చు. అంతర పంటల మధ్య సేద్యం కల్పతరువుగా మారింది. ఈ పంటకు వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. వీటి ద్వారా ప్రధాన పంటలతో పాటు సమానంగా ఆదాయాన్ని తీస్తున్నారు… కూరగాయల పంటలను వేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.. ఒక్క కొబ్బరి పంటలోనే కాదు.. వేరే పంటలలో కూడా అదనపు పంటలను వేసుకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతూన్నారు..