రైతులకు ఉపయోగపడే కొత్తకొత్త టెక్నాలజీ, వైవిధ్యమైన మెలుకులను తేలియజేసే సోర్స్ ఆఫ్ సస్టెన్సెస్ ఇప్పుడు మరో వీడియోతో మన ముందుకు వచ్చింది. ఈ సారి ఆరుతడి పంటలు వేయడం.. వాటి నుంచి రైతులు అధిక దిగుబడి రాబట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వీడియోలో వెల్లడించారు. అయితే ఇప్పటికే పంటసాగులో వివిధ రకాల మెలుకువలను మనం చూసే ఉంటాం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ.. అధిక రాబడిని రైతులు రాబడుతున్నారు. అయితే కొందరు రైతులు మాత్రం సాగు చేయడంలో టెక్నాలజీని, టెక్నిక్ లను తెలుసుకోలేక వెనుకబడుతున్నారు.
టెక్నాలజీపై అవగాహన లేని మధ్య తరగతి రైతులకు ఎంతగానే ఉపయోగపడే విధంగా సోర్స్ ఆఫ్ సస్టెన్సెస్ మేధాశక్తిని అందిస్తోంది. పంటలను వేయడం, వాటిని సంరక్షించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ప్రత్యేకమైనవి. ఎంతగానే ఉపయోగపడే అత్యాధునిక, తక్కువ ఖర్చుతో కూడిన మెలుకులను తేలియజేసి.. రైతులు పాలిట కొంగు బంగారం చేస్తూ ముందుకు వెళ్తోంది సోర్స్ ఆఫ్ సస్టెన్సెస్. మీరు కూడా వైవిధ్య వ్యవసాయంలో ఈ వీడియోను చూసేయండి.