NTV Telugu Site icon

Viral: నదిలో యువకుడి స్టంట్.. తిరిగిరాలేదు..

Girna River

Girna River

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.. వాగులు, వంకలు, చెరువులు, నదులు పోటెత్తుతున్నాయి.. చాలా మంది వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.. లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతులు.. ఆయా రాష్ట్రాలు వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయాయి.. తెలుగు రాష్ట్రాలను ఇంకా వరదలు వీడడం లేదు.. వర్షాలు తగ్గుముఖం పట్టినా.. గోదావరి ఉధృతి ఇంకా తగ్గలేదు.. అయితే, వరదల్లో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు యువకులు, పిల్లలు వరదనీటిలోనూ ఈతలు కొడుతున్నారు. ఆటలు ఆడుతున్నారు. మరికొందరు వరదలో స్టంట్స్‌ చేస్తున్నారు.. అయితే, స్టంట్స్‌ పేరుతో బ్రిడ్జిపై నుంచి నదిలో దూకిన ఓ యువకుడు కనిపించకుండా పోయాడు…

Read Also: CM KCR: నేడు టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం

మహారాష్ట్ర జరిగిన యువకుడి స్టంట్‌ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గిర్ణా నదిలో స్టంట్‌ చేయాలని అనుకున్నాడు నయీమ్‌ అమీన్‌ అనే యువకుడు.. దానిని ఫోన్‌లో చిత్రీకరించేందుకు తన స్నేహితుడిని కూడా వెంట తెచ్చుకున్నాడు.. ఇక, తన స్నేహితుడు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో బందిస్తుండగా.. మాలేగావ్‌లో బ్రిడ్జిపైనుంచి గిర్ణా నదిలోకి దూకాడు నయీమ్​ అమీన్​.. కానీ.. అప్పటికే ఆ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. ఆ వరదలో కొట్టుకుపోయాడు.. ఇకనైనా పైకి తేలుతాడేమో.. అని చూసినా జాడ కనిపించలేదు.. ఎంతసేపు గాలించినా.. అతడి ఆచూకీ లభించలేదు. ఓవైపు వరదలతో జనం ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు ప్రాజెక్టులను, నది ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు భారీగానే వెళ్తున్నారు.. కానీ, ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఇలా ప్రాణాలు వదలడం మాత్రం విషాదాన్ని నింపుతోంది.