దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిల్లో ఆల్కాహాల్ ఒకటి. దీని ద్వారానే ప్రభుత్వాలకు అధిక ఆదాయం వస్తుంది. అయితే, ఆల్కాహాల్ తీసుకున్న తరువాత మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానిపై వైద్యులు కీలక వ్యాఖ్యలు చేశారు. మగ్గబెట్టిన పండ్లు, ధాన్యం, కూరగాయలతో మద్యాన్ని తయారు చేస్తారు. వీటిని మగ్గబెట్టినపుడు దాని నుంచి ఈస్ట్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఈస్ట్ నుంచి అల్కాహాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ఈస్ట్ నుంచి ఈథనాల్ కూడా ఉత్పత్తి అవుతుంది. మద్యాన్ని సేవించిన తరువాత అది పేగుల ద్వారా రక్తంలోకి ప్రవేశించి వేగంగా మెదడుకు చేరుతుంది. అయితే, మద్యం సేవించే సమయంలో ఆహారం తీసుకుంటే మద్యం ఎక్కువ సమయం శరీరంలో ఉంటుంది.
Read: Oil Price: కేంద్రం నిర్ణయంతో దిగిరానున్న ఆయిల్ ధరలు…
ఆహరం తీసుకోకుంటే రక్తంలో ఈ మద్యం వేగంగా కలిసిపోతుంది. అక్కడి నుంచి శరీరం మొత్తానికి వ్యాపిస్తుంది. ఆల్కహాల్ తీసుకున్న 5 నిమిషాల్లో మెదడును చేరుతుంది. 10 నిమిషాల్లో శరీరంపై ప్రభావం చూపుతుంది. మద్యం తీసుకున్నాక శరీరంలో సెరటోనిన్, డొపమైన్ లు ఉత్పత్తి అవుతాయి. ఇది మనిషిని సంతోషంగా ఉండేలా చేస్తాయి. అయితే, ఎక్కువ మద్యం తీసుకుంటే మనిషిని మత్తుగా మారుస్తాయి. మనిషి శరీరంలోని కాలేయం ఒక గంటకు యూనిట్ ఆల్కాహాల్‌ను మాత్రమే ఆక్సీకరణం చేయగలదు. తక్కువ సమయంలో ఎక్కువ ఆల్కాహాల్ తీసుకుంటే దాని ప్రభావం లీవర్ పనితీరుపై పడటమే కాకుండా ఆల్కాహాల్ డైరెక్టుగా రక్తంలో కలిసిపోతుంది. ఫలితంగా శరీరంపై చెడు ప్రభావం పడుతుంది.