సాధారణంగా తెనేటీగలు, కందిరీగలను చూస్తే మనకు భయమేస్తుంది. ఎందుకంటే.. కుడితే ఎక్కడ వాచిపోతుందో తెలియదు.. కొన్ని సార్లు ప్రాణాంతకం కావచ్చు.. వాటితో జాగ్రత్రగా.. ఉండాలి.. కందిరీగలు చూడడానికి నల్లగా, కొన్ని పసుపు రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువగా చెవులలో దూరుతూ ఇబ్బంతి పెడతాయి. దీంతో చెవిపోటు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఓ వ్యక్తం ఏకంగా కందిరీగలను నోట్లో పెంచుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also:Accident:సమోసాలు కొనడానికి వచ్చిన బాలుడు.. అంతలోనే…
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ‘వాస్ప్ మ్యాన్’ ఈ వైరల్ వీడియో గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. చాలామంది దీనిని ‘ఘోరమైన స్టంట్’ అని పిలుస్తుండగా.. భారీ సంఖ్యలో నెటిజన్లు దీనిని కృత్రిమ మేధస్సు లేదా ఎడిటింగ్ చేసిన అద్భుతం అని కామెంట్ చేస్తున్నారు.
మీరు చాలా రకరకాల స్టంట్ వీడియోలను చూసి ఉండవచ్చు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో వీక్షకులను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన నోటిలో డజన్ల కొద్దీ కందిరీగలను దాచిపెట్టాడు. ఆ వ్యక్తి నోరు తెరిచిన వెంటనే కందిరీగల గుంపు బయటకు ఎగిరిపోతుంది. ఇది వీడియో ఎడిటింగ్ ఫీటా లేదా ప్రమాదకరమైన స్టంట్ అనేది మనకు క్లారిటీగా తెలియడంలేదు. ఇన్ స్టాగ్రాంలో ఈ వీడియో వైరల్ అవుతుండగా. .. అందులో టోపి పెట్టుకున్న వ్యక్తి నోరు మూసుకుని నిలబడ్డాడు. అతను ఎప్పుడైతే నోరు అమాంతం తెరవడంతో కందిరీగలన్ని బయటకు పోయాయి.. ఇది చూడడానికి భయంకరంగాను.. అదో రకంగాను అనిపిస్తుంది.
Read Also:Twist: వేరో వ్యక్తితో హోటల్ లో ఉన్న భార్య.. మరో వ్యక్తిపై భర్త దాడి
ఇప్పుడు ఈ “వాస్ప్ మ్యాన్” వీడియో సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. చాలామంది దీనిని “డెడ్లీ స్టంట్” అని .. ఎక్కువ శాతం నెటిజన్లు మాత్రం దీన్ని ఆర్టీపీషియల్ ఇంటలీజెన్స్ ద్వారా క్రియేట్ చేసి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు విపరీతమైన స్పందనలు వచ్చాయి. ఒక యూజర్ “ఇది వాస్ప్ మ్యాన్, బ్రదర్ అని వ్యాఖ్యానించారు. మరొక యూజర్ “ఇది మూర్ఖత్వం పరాకాష్ట” అని అన్నారు.