More Than 10 Accused Fingerprint Matches in Renukaswamy Murder Case: రేణుకా స్వామి హత్య కేసు ఇప్పుడు బలపడింది. నిందితులు మరింత కష్టాలను ఎదుర్కొనాల్సి రావచ్చు. నేరం జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. చిత్రదుర్గ రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అండ్ కో ప్రమేయం ఉంది. ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. మొదటి నిందితురాలు పవిత్ర గౌడ సహా నిందితులందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉండగా, నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు. రోజురోజుకు ఈ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పుడు రేణుకా స్వామి హత్య కేసు మరింత బలపడింది. నిందితుల వేలిముద్ర సరిపోలినట్లు సమాచారం. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎల్ నుంచి నివేదిక వచ్చింది. నివేదికలో షాకింగ్ అంశాలున్నాయని, నిందితుల వేలిముద్రలు నిర్ధారణ అయ్యాయని చెబుతున్నారు.
Sanjana: అర్థరాత్రి వీఐపీ కొడుకు అసభ్యకరమైన మెసేజులు.. సంజన సంచలన వ్యాఖ్యలు
రేణుకాస్వామి హత్యకు గురైన స్థలం, మృతదేహాన్ని తరలించిన వాహనం, స్వాధీనం చేసుకున్న వాహనాలతో పాటు పలు ప్రాంతాల్లో వేలిముద్రలు సేకరించారు. ఈ వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలాయి. పది మందికి పైగా నిందితుల వేలిముద్రలు సరిపోలినట్లు సమాచారం. దాడి జరిగిన నిర్దిష్ట ప్రదేశాలు, హత్య జరిగిన ప్రదేశం, మృతదేహాన్ని తరలించిన వాహనం, మృతదేహాన్ని పడేసిన ప్రదేశం, మృతదేహంపై బట్టలు, వివిధ ప్రాంతాల నుండి వేలిముద్రలు సేకరించారు. దాడిలో ఉపయోగించిన వస్తువులు, చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని తీసుకెళ్లిన వాహనం, నిందితుల ఇళ్లలోనూ వేలిముద్రలు సేకరించారు. వీటన్నింటిని నిందితుల వేలిముద్రల నమూనాలతో పాటు బెంగళూరు, హైదరాబాద్ ఎఫ్‌ఎస్‌ఎల్ కేంద్రాలకు పంపించారు. ప్రస్తుతం రెండు కేంద్రాల నుంచి నివేదిక రాగా, నేరం జరిగిన ప్రదేశంలో లభించిన వేలిముద్రలు, పది మందికి పైగా నిందితుల వేలిముద్రలతో సరిపోలినట్లు తెలుస్తోంది. 10 మందికి పైగా నిందితుల వేలిముద్రలు సరిపోలినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయా లేదా అనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు.