Fake Kidnapping Reel: ‘నకిలీ కిడ్నాప్’ రీల్ వైరల్.. నలుగురు యువకులపై కేసు
- యూపీలో రీల్స్ చేసిన యువకుల అరెస్ట్
- నకిలీ కిడ్నాప్ వీడియో చిత్రీకరించిన నలుగురు యువకులు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం నెటిజన్లు రీల్స్ వ్యసనంగా మారారు. దీంతో రీల్స్ క్రియేట్ చేసే వాళ్లు కంటెంట్ కోసం చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా వైరల్ అవుతున్న ఈ వీడియోలో యువకులు డిఫరెంట్ గా ఆలోచించి రీల్ రూపొందించారు. నలుగురు అబ్బాయిలు ‘నకిలీ కిడ్నాప్’ చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ చేరుకున్నారు. ‘ఫేక్ కిడ్నాప్’ వీడియోలు చేసి ఫేమస్ కావడమే వీరి లక్ష్యం. ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ నకిలీ కిడ్నాప్ రీల్ చేసిన యువకులను నిజమైన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే..
READ MORE: Israel: ఆరుగురు అల్ జజీరా జర్నలిస్టులు టెర్రరిస్టులు.. ఇజ్రాయిల్ ఆరోపణలు..
Also Read
- Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
వీడియోలో ఏముందంటే..
ఈ వీడియోలో.. ఓ యువకుడు చాట్ షాప్ వద్ద నిలబడి చాట్ తింటున్నాడు. ఇంతలో ఇద్దరు అబ్బాయిలు స్ప్లెండర్ బైక్‌పై వచ్చి ఏదో వాసన చూయించి ఆ యువకుడిని బైక్ మధ్యలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు. ఈ క్రమంలో బైక్ నడుపుతున్న వ్యక్తి చెప్పులు ఊడిపోవడంతో కిక్ రాడ్డును కొట్టలేక పోతాడు. బైక్ స్టార్ట్ కాకపోవడంతో వెంటనే బహిరంగంగా జరుగుతున్న కిడ్నాప్‌ను చూసి ప్రజలు అడ్డుకునేందుకు ముందుకు వస్తారు. బైక్ పైన వచ్చిన యువకులను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా… ఆ యువకులు కెమెరామెన్ వైపు చూపిస్తూ ఇదంతా వీడియో తీస్తున్నట్లు, ఇది ఫ్రాంక్ అని చెబుతారు. ఆ తర్వాత ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
READ MORE:Pushpa 3 : పుష్ప 3 కూడా.. నిర్మాత సంచలనం
ఈ రీల్‌కి సంబంధించి ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కెమెరామ్యాన్‌తో సహా ఈ నలుగురు అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ వీడియోను ఎక్స్‌లో పంచుకున్న @SachinGuptaUP ఖాతాదారు.. ఈ వీడియో చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీడియోను పోస్ట్ చేస్తూ.. “యూపీలోని ముజఫర్‌నగర్‌లో నలుగురు అబ్బాయిలు కిడ్నాప్ రీల్‌ను షూట్ చేశారు. ఈ నలుగురు రీల్‌పుత్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేర్లు గుల్షేర్, మోనిష్, సాదిక్, సమద్.” అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
मुजफ्फरनगर, यूपी में 4 लड़के अपहरण की Reel शूट कर रहे थे। पुलिस ने चारों रीलपुत्रों को धर दबोचा। नाम हैं गुलशेर, मोनिश, सादिक और समद। @AnujTyagi8171 pic.twitter.com/LyFD88bKI2
— Sachin Gupta (@SachinGuptaUP) October 23, 2024
తాజావార్తలు
-
Rajasthan: పదవీ విరమణకు ఒకరోజు ముందు షాక్.. ఉద్యోగాన్ని కోల్పోయిన టీచర్.. కారణం తెలిస్తే..!
-
ICC T20 Rankings: వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించినా తగ్గేదేలే.. అగ్రస్థానంలో తెలుగు బిడ్డ..
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!